నెల్లూరు,మే11(జనం సాక్షి ): ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టాలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి విలేకరుల సమావేశంలో అన్నారు. నెల్లూరు ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో తిరిగి తానే ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రకటించుకోవడం ఆయన నియంతృత్వ పోకడ అర్థమవుతుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. కర్నాటకలో తిరిగి కాంగ్రెస్ అధికరాం నిలబెట్టుకుంటుందని అన్నారు. రాహుల్ ప్రధాని కావడం తథ్యమని అన్నారు.




