Monday, 2 November 2026

విమానంలో యోగా చేసి ఇరుక్కున్నాడు


hqh8x18i
హోనోలులు: ఓ వ్యక్తి విమానంలో యోగా చేసిఅరెస్టయ్యాడు. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో చోటుచేసుకుంది ఈ ఘటన. దక్షిణ కొరియాకి చెందిన యోంగ్‌టే పే అనే వ్యక్తి హోనోలులు నుంచి జపాన్‌కి వెళుతున్న విమానంలో ప్రయాణిస్తున్నాడు. విమానం బయల్దేరిన కాసేపటికి తన సీటులో కూర్చోకుండా పక్కవారికి ఇబ్బంది కలిగిస్తూ యోగా చేయడం మొదలుపెట్టాడు. సీటులో కూర్చోమని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పైగా వారిపై గట్టిగా కేకలు వేశాడు. అడ్డువచ్చిందని భార్యను కూడా తోసిపారేశాడు. దీంతో విమానాన్ని తిరిగి హవాయికి మళ్లించాల్సి వచ్చింది.

అతని వికృత చేష్టలకి ప్రయాణికులు, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌బీఐ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తనకు భోజన సమయంలో సీట్‌లో కూర్చోవాలనిపించలేదని అందుకే సీట్‌ వెనక్కి వెళ్లి యోగా, ధ్యానం చేసుకోవాలనుకున్నానని వివరించాడు. యోంగ్‌టే అసహజ ప్రవర్తనతో తమకు ఇబ్బంది కలిగించడమే కాక దేవుడు లేడు.. అందరినీ చంపేస్తానంటూ బెదిరించాడని ప్రయాణికులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తోటిప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బంది పెట్టినందుకు యోంగ్‌టే 25,000 డాలర్లు జరిమానా చెల్లించాలని, దీనితో పాటు అతను ప్రస్తుతం ఉన్న ఓహు ద్వీపం దాటి వెళ్లకూడదని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *