.విమానం కూల్చిన వారిని పట్టుకుంటాం
మాస్కో, నవంబర్17(జనంసాక్షి):
గత నెల ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో తమ దేశ విమానాన్ని కూల్చేసిన వారి అంతుచూసే దాకా నిద్రపోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిన బూనారు. విమానాన్ని కూల్చేసి.. 224 మంది మృతిచెందడానికి కారణమైన వారిని పట్టుకొని చట్టం ద్వారా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. విమానం కూల్చివేతకు కారణమైన వారి సమాచారాన్ని తెలియజేసిన వారికి 50 మిలియన్ డాలర్లు (రూ. 330 కోట్లు) బహుమానం ఇస్తామని రష్యా ప్రభుత్వం తెలిపింది.
అధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం రష్యా భద్రతా చీఫ్ అలెగ్జాండర్ బోట్ర్‌నికోవ్ భేటీ అయి.. ఈజిప్టులో కూలిన విమానం ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తముందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు పెట్టిన బాంబు వల్లే విమానం ఆకాశంలో ముక్కలైందని వెల్లడించారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ‘ కారకులు ఎక్కడ దాగివున్నా.. వారి వెతికి మరీ పట్టుకుంటాం. ప్రపంచంలోని ఏ మూల దాగున్నా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వారిని శిక్షించి తీరుతాం’ అని బొట్ర్‌నికోవ్‌తో చెప్పారని క్రెమ్లిన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ 7ఐ9268 ఎయిర్‌బస్-321 విమానం గత నెల 31న ఈజిప్టులోని షర్మ్-అల్-షేక్ విమానాశ్రం నుంచి బయలుదేరిన కాసేపటికే కూలిపోయింది. 224 మందితో ప్రయాణించిన ఈ విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించింది.
ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో విమానం కూలిపోయిన ఘటనలో ఉగ్రవాద హస్తముందని రష్యా సీనియర్ భద్రతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఉగ్రవాదుల చర్య వల్లే ఆ విమానం కూలిపోయిందని రష్యా భద్రతాధిపతి అలెగ్జాండర్ బోట్రోనికోవ్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తెలిపారు. 224 మందితో బయలుదేరిన రష్యా విమానం సినాయ్ ద్వీపకల్పంలో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన సమావేశంలో ఈ ఘటన గురించి ఎఫ్‌ఎస్‌బీ భద్రతా ఏజెన్సీ చీఫ్ బోట్రోనికోవ్ పుతిన్‌కు వివరించారు. ఈ ఘటన ఉగ్రవాద చర్య వల్లే జరిగిందనే విషయంలో ఎలాంటి సందిగ్ధానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. కిలో బరువున్న పేలుడు పదార్థం టీఎన్‌టీకి సమానమైన బాంబు పేలడంతో గాలిలోనే ఆ విమానం ముక్కలైపోయిందని ఆయన పుతిన్‌కు వివరించారని స్థానిక విూడియా తెలిపింది.