విశాఖపట్టణం (మార్చి 03): చిట్టీల పేరుతో మోసపోయామంటూ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు విశాఖ వాసులు. అక్కయ్యపాలెం ప్రాంతంలోని నరసింహనగర్‌కు చెందిన రామకృష్ణ దంపతులు తమను మోసం చేశారని కమిషనర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ భార్యాభర్తలు దాదాపు రూ.5 కోట్ల రూపాయల మొత్తానికి చిట్టీలు కట్టించుకుని టోకరా ఇచ్చారని సిపి దృష్టికి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు.




