Wednesday, 4 November 2026

జగన్‌ సీఎం అయితే ఏపీ మరో సోమాలియా: టిడిపి

నెల్లూరు (మార్చి 04): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిఎం అయి ఉంటే, ఆకలిదప్పులు, నేరాలతో నలిగిపోయిన సోమాలియా దేశంలా ఏపీ మారేదని నెల్లూరు నగర టిడిపి అధ్యక్షుడు కోటంరెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే తీరు కొనసాగిస్తే వైసీపీ అధ్యక్షుడిని ప్రజలు క్షమించరని కోటంరెడ్డి మండిపడ్డారు. జగన్ ఒక బాధ్యతగల ప్రతిపక్షనేతగా వ్యవహరించాలని హితవు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *