విశాఖపట్నం: నీలం తుపాను ప్రభావంతో పంట నష్టం జరిగిన జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు ఈరోజు పర్యటించారు. మినుములూరు, వంతాడపల్లి, గెడ్డంపుట్టు. జి. మాడుగుల ప్రాంతాల్లో మంత్రి పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. బాధితలకు నష్టపరిహారాన్ని త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హుకుంపేట మండల చీడిపుట్టు వంతెన వీలైనంత త్వరగా నిర్మిస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. అనంతరం పంట నష్టం, ఇళ్లు నష్టంపై అధికారులతో సమీక్షించారు.




