విజయవాడ,(జనంసాక్షి): విజయవాడ థర్మల్ విద్యుత్ ప్లాంటు(వీటీపీఎస్) నాలుగో యూనిట్‌లో శనివారం సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో అధికారులు మరమ్మతులకు ఆదేశించారు. విద్యుదుత్పత్తిని పునరుద్ధరించేందుకు సాంకేతిక బృందం చర్యలు చేపట్టింది.




