
అమేథీ, జూన్ 29 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతున్న భారత వాయుసేన హెలికాప్టర్ కూలి మరణించిన భారత వైమానిక దళం అధికారి అఖిలేశ్‌కుమార్ సింగ్ అంత్యక్రియల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం తన నియోజకవర్గమైన అమేథీ పరిధిలోని పురుషత్‌గంజ్ సమీపంలోని పురీనాగాలో అఖిలేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. పురుషత్‌గంజ్ విమానాశ్రాయం నుంచి రోడ్డు మార్గం ద్వారా పురీనాగో చేరుకున్న రాహుల్ తొలుత అఖిలేశ్ భౌతిక ఖాయానికి నివాళులర్పించారు. అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏళ్లవేళలా సాయమందిస్తామని, కుటుంబానికి అడ్డంగా ఉంటామని పేర్కొన్నారు. అనంతరం అంతిమయాత్ర, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
వీర జవాన్ అంత్యక్రియల్లో రాహుల్




