Tuesday, 3 November 2026

వెంటాడి రాడ్లతో కొట్టి చంపారు.

3lmy2q35హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వెంబడించిన దుండగులు ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. చాంద్రాయణగుట్టకు చెందిన సోహెల్ లక్డీకాపూల్ మీదుగా బైక్ పై వెళ్తుండగా వెనక నుంచి మరో వాహనంలో వచ్చిన దుండగులు ఢీ కొట్టారు. కిందపడిపోయిన సోహెల్‌ను దుండగులు తీవ్రంగా కొట్టారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని గమనించిన సోహెల్ తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న సంధ్య హోటల్ కి వెళ్లాడు. అతని వెంబడించిన దుండగులు హోటల్ లోకి వచ్చి రాడ్లతో కొట్టి చంపారు. ఈ సన్నివేశాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాతకక్ష్యలే కారణమని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *