వెలుగొండ కోసం పాదయాత్ర

ఒంగోలు,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 9 నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్లు సీపీఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి డి.సోమయ్య తెలిపారు. రెండు బృందాలుగా పాదయాత్ర జరుగుతుందన్నారు. 9న పామూరు నుంచి, 11న యర్రగొండపాలెం నుంచి రెండు బృందాలు పాదయాత్రలో పాల్గొంటాయన్నారు. ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. పార్టీలకు అతీతంగా పాదయాత్రలో ప్రజలు పాల్గొనాలని కోరారు. పాదయాత్ర అనంతరం ఈ నెల 17న మార్కాపురంలో బహిరంగ సభ నిర్వహించన్నుట్లు తెలిపారు. కార్యక్రమానికి సీపీఎం జాతీయ నాయకులు బీవీ రాఘవులు, వి.శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు తదితరులు హాజరవుతారన్నారు.

 

తాజావార్తలు