Tuesday, 3 November 2026

వైమానిక ప్రదర్శన… ట్రాఫిక్‌ ఆంక్షలు

 హైదరాబాద్‌: బేగంపేటలో వైమానిక ప్రదర్శన సందర్భంగా శని, ఆదివారాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించామని ఉత్తరమండలం డీసీపీ ఎన్‌.ప్రకాష్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సందర్శకులు ఎయిర్‌కార్గో ప్రవేశద్వారం నుంచి వెళ్లి పార్కింగ్‌లో వారి వాహనాలను ఉంచాలని వివరించారు. పీఎన్‌టీ జంక్షన్‌ నుంచి ఎట్టిపరిస్థితుల్లో సందర్శకులను అనుమతించబోమని వివరించారు.
* సందర్శకులు నీళ్లసీసాలు, సంచులు, కత్తులు, బరిసెలు, కర్రలు, రాళ్లు తీసుకుని రాకూడదు.

* అగ్గిపెట్టెలు, సిగరెట్‌లైటర్లు, బాణసంచా, నల్ల జెండాలు, ఇతర అభ్యంతరకర వస్తువులు వెంటతెచ్చుకుని లోపలికి ప్రవేశించరాదు.

* నిర్ణీత సమయం వరకూ వైమానిక ప్రదర్శనను చూసి వెళ్లాలి. ఏవైనా సందేహాలుంటే సమీపంలోని ట్రాఫిక్‌, శాంతిభద్రతల అధికారులను సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *