వైఎస్‌కు భారతరత్న ఇవ్వాలి

అమరావతి,జూలై10(జ‌నం సాక్షి): మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి భారతరత్న ఇవ్వాలని ఆకాంక్షిస్తూ కోటి సంతకాల ఉద్యమం చేపట్టినట్టు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో వైఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. వైఎస్‌కు భారత రత్న ఇవ్వాలంటూ కోటి సంతకాల ఉద్యమాన్ని అక్కణ్నుంచే ప్రారంభించారు. కార్యక్రమంలో వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌, ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌, గౌరు చరిత, రవీంద్రనాథ్‌రెడ్డి, కోన రఘుపతి, ప్రతాప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.