Tuesday, 3 November 2026

వైఫల్యాలను ఎత్తి చూపడం తప్పా – రేవంత్..

2హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపడమే తప్పా అని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్ జిల్లా ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడు దఫాలుగా ఎన్నికలు జరిగాయని, శాసనసమండలికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి దేవీశ్రీప్రసాద్ టిడిపి – బిజెపి అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారని గుర్తు చేశారు. సంవత్సరం తరువాత ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పనులకు ప్రజలు ఆమోదం తెలిపారని, ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని తిరస్కరించారని కేసీఆర్ పేర్కొనడం జరిగిందన్నారు. పేర్కొన్నారు. గతంలో ఓటమిని కూడా స్వాగతిస్తే అభినందించే వాళ్లమని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఇంతవరకు 520 మందిని మాత్రమే తెలంగాణ అమరవీరులుగా గుర్తించారని, ఇతరులను గుర్తించడానికి ఇంకెంతకాలం పడుతుందని ప్రశ్నించడం జరిందన్నారు. రైతు రుణమాఫీ, చీప్ లిక్కర్ ఇతర అంశాలపై ప్రశ్నించడం జరిగిందని, వాటర్ గ్రిడ్ పనుల రూపంలో ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *