Tuesday, 3 November 2026

శబరిమలై ప్రత్యేక రైళ్లకు మౌలాలిలో స్టాప్‌

bftq27xxసికింద్రాబాద్‌ : హైదరాబాద్‌-కొల్లం-హైదరాబాద్‌ శబరిమలై స్పెషల్‌ (రైల్‌నెంబర్‌: 07109/07110 వయా ఖాజీపేట్‌, విజయవాడ, గూడూరు, రేణిగుంట, సేలం : 38 సర్వీసులు) హైదరాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07109) హైదరాబాద్‌ నుంచి డిసెంబరు 11, 15, 16, 19, 23, 24, 31, జనవరి 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15వ తేదీల్లో… హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.55గంటలకు బయల్దేరి, సికింద్రాబాద్‌ స్టేషన్‌కు… 4.20 గంటలకు చేరుకొని, 4.30 గంటలకు బయల్దేరుతుంది. మౌలాలి స్టేషన్‌కు… 4.42 గంటలకు చేరుకొని, 4.44గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.30గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో… కొల్లం-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌ : 07110)… కొల్లం నుంచి డిసెంబర్‌ 13, 17, 18, 21, 25, 26, జనవరి 2, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17వ తేదీల్లో తెల్లవారుజామున 2.15గంటలకు బయల్దేరి, రెండో రోజు ఉదయం 9.15గంటలకు మౌలాలి చేరుకొని, 9.17గంటలకు బయల్దేరుతుంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు 9.40గంటలకు చేరుకొని, 9.50గంటలకు బయల్దేరుతుంది. హైదరాబాద్‌ స్టేషన్‌కు ఉదయం 10.30 గంటలకు చేరుతుంది.
అదే విధంగా హైదరాబాద్‌-కొల్లం-హైదరాబాద్‌ శబరిమలై స్పెషల్‌ (రైల్‌నెంబర్‌: 07133/07134-వయా…నడికుడి, గుంటూరు, గూడూరు, రేణిగుంట: 10 సర్వీసులు)
హైదరాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌ : 07133) హైదరాబాద్‌ నుంచి డిసెంబరు 12, 20, 30, జనవరి 2, 16వ తేదీల్లో హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.30గంటలకు బయల్దేరి, సికింద్రాబాద్‌ స్టేషన్‌కు… 3.55గంటలకు చేరుకుని, 4.05గంటలకు బయల్దేరుతుంది. మౌలాలి స్టేషన్‌కు… 4.15గంటలకు చేరుకుని, 4.17గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.30గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో…. కొల్లం-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌ : 07134)…కొల్లం నుంచి డిసెంబరు 9, 16, 23, జనవరి 4, 18వ తేదీల్లో తెల్లవారుజామున 2.15గంటలకు బయల్దేరి, రెండో రోజు ఉదయం 9.15 గంటలకు మౌలాలి చేరుకొని, 9.16గంటలకు బయల్దేరుతుంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు 9.40గంటలకు చేరుకొని, 9.50గంటలకు బయల్దేరుతుంది. హైదరాబాద్‌ స్టేషన్‌కు ఉదయం 10.30గంటలకు చేరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *