వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణానికి ప్రోత్సాహం

కాకినాడ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఆయా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని జడ్పీ ఛైర్మన్‌ రాంబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగాబహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ఎంపికై ఆయా సర్పంచులు పురస్కారాలు పొందారని ఆయన చెప్పారు. మెజార్టీ పంచాయతీలు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా గుర్తించేందుకుగాను చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించటంలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఉపాధి నిధులు, జడ్పీ నిధులు, 14వ ఆర్థికసంఘం నిధులు కలిపి జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ గ్రామాల్లో ఇంతవరకు 281 కిలోవిూటర్ల మేర సిమెంట్‌ రహదారుల నిర్మాణం పూర్తయిందని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ తెలిపారు.

తాజావార్తలు