
– రాష్ట్రానికి అవసరమైన పంటలన్నీ ఇక్కడే పండిద్దాం
– సమీక్షాసమావేశంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి 18(జనంసాక్షి):వ్యవసాయరంగంలో వినూత్న మార్పులతో ముందుకు సాగాలని, రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. లక్షల మంది రైతులు ఆధారపడే వ్యవసాయశాఖపై బాధ్యత ఉందని, వ్యవయసాయరంగం కోసం భిన్నకోణాల్లో ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. న్యాక్‌లో వ్యవసాయ, దాని అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. అధిక వర్షాలు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రణాళిక ఉండాలని, రైతులకు సరిపడ విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
కల్తీ విత్తనాల బెడద లేకుండా చూడాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయశాఖకు తక్కువ నిధులు ఉన్నాయని తెలిపారు. యాంత్రీకరణ, గ్రీన్ హౌస్ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ పెరగాలని సీఎం చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన కూరగాయాలను ఇక్కడే పండిచ్చేలా చూడాలని పేర్కొన్నారు. పత్తి ఎగుమతులపై
విధించే పన్ను కారణంగా.. భవిష్యత్‌లో పత్తికి మంచి ధర రాకపోవచ్చని వెల్లడించారు. పత్తికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, రైతులకు మేలు చేసే పద్ధతులు తేవడానికి వ్యవసాయ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. లక్షలాది మంది రైతులు ఆధారపడే వ్యవసాయ శాఖపై చాలా బాధ్యత ఉందని తెలిపారు. వ్యవసాయ రంగం కోసం భిన్నకోణాల్లో అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధిక వర్షాలు ఉన్నప్పుడు ఒక రకంగా.. వర్షాలు లేనప్పుడు మరో రకంగా వ్యూహాలు ఉండాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు, ఎరువుల కొరత లేకుండా చేశామని చెప్పారు. ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా చేయాల్సి ఉంది. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచడానికి కల్తీ విత్తనాల బెడద లేకుండా చూడాలన్నారు. వ్యవసాయ విస్తరణ పనులు జరగాలని సూచించారు. పురుగుల మందు వాడకాన్ని నియంత్రించాలన్నారు. ప్రధానంగా సేంద్రియపద్దతుల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. తక్కువ పెట్టుబడి, గ్యారెంటీ మార్కెట్ ఉన్న మొక్కజొన్న, సోయాబీన్ సాగు పెంచాలన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగాలి. గ్రీన్ హౌస్ కల్టివేషన్, మైక్రో ఇరిగేషన్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి అవసరమయ్యే కూరగాయాలన్నీ ఇక్కడే పండించాలి. మిర్చి, అల్లం, పసుపు పంటలకు తెలంగాణ భూములు అనుకూలం. ఆ పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించాలి. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు చేదోడువాదోడుగా ఉండాలని చెప్పారు. సవిూక్షకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు.




