Wednesday, 4 November 2026

శంషాబాద్‌ వరకు మెట్రో విస్తరించాలి

5
– 2017 వరకు పూర్తి చేయాలి

– ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,మే12(జనంసాక్షి): మెట్రో రైలు త్వరగా పరుగుపెట్టేలా చూడడంతో పాటు విస్తరణపై సిఎం కెసిఆర్‌ దృష్టి సారించారు.  2017 ఏప్రిల్‌ నాటికి మెట్రో పనులు పూర్తికావాలనికేసీఆర్‌ మెట్రో అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట విూదుగా ఇన్నర్‌ రింగ్‌రోడ్డు విూదుగా మెట్రోమార్గ విస్తరణను పరిశీలించాలని కూడా  కోరారు. శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకునేందుకు ఫలక్‌నుమా, రాయదుర్గం నుంచి మెట్రోమార్గం వేయాలని సూచించారు. మెట్రో పనలు స్థితి పురోగతిపై సచివాలయంలో సిఎం ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. మెట్రోరైలు నిర్మాణ పనుల పురోగతిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికీ ఉపయోగపడేలా మెట్రోరైలు ఉండాలని ఆయన అభిలషించారు. మెట్రో రైలు పనులపై మంత్రులు, ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సవిూక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా విమానాశ్రయం వెళ్లేవారికి మెట్రో ఉపయోగపడాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఫలక్‌ నుమా, రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రోరైలు అవసరముందని అన్నారు. ఢిల్లీ తరహా భద్రతా వ్యవస్థ హైదరాబాద్‌ మెట్రోరైలుకు కల్పించాలన్నారు. మెట్రోరైలుకు విద్యుత్‌ సబ్సిడీ అందించేందుకు కేసీఆర్‌ అంగీకరించారు. ఎల్‌ అండ్‌ టీ సీఈవో వీఎన్‌ గాడ్గిల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నగరంలో మెట్రో పనుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. మెట్రో రైలు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. మెట్రో రైలు మార్గం నగర ప్రజలకే కాకుండా హైదరాబాద్‌ వచ్చిపోయే ప్రయాణికులకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వే స్టేషన్లు, ఇమ్లిబన్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు మెట్రో రైలు సేవలు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గతంలో ప్రాజెక్టు డిజైన్‌ చేసినవారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును విస్మరించారని పేర్కొన్నారు.  ఎల్బీనగర్‌ నుంచి చంద్రాయణగుట్ట విూదుగా మెట్రో రైలు మార్గం వేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును అనుకుని రైలు మార్గం నిర్మించాలని చెప్పారు. ఇప్పటి వరకు పనులు ఆశించిన మేర జరుగుతున్నాయన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ను సబ్సిడీ ధరలో అందిస్తామని స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టు పనితీరుపై సీఎస్‌ ఆధ్వర్యంలో వారానికొక సారి సవిూక్ష నిర్వహిస్తామని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, రోడ్ల వెడల్పు కార్యక్రమాలను ప్రభుత్వమే చేపడుతుందన్నారు.

రైల్వే లైన్ల వద్ద 8 ఆర్‌వోబీల నిర్మాణానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఒకటిన్నర కిలోవిూటర్ల మార్గంలో అనుమతుల కోసం ఆ శాఖ మంత్రితో మాట్లాడమని తెలిపారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించామన్నారు. మెట్రో అధికారులు పోలీసులతో కలిసి భద్రత వ్యూహం రూపొందించాలని సూచించారు. ఢిల్లీ మెట్రో రైలులో అవలంభిస్తున్న భద్రతా విధానాన్ని అమలు చేయాలన్నారు. అన్ని రకాల అగ్నిమాపక అనుమతులు జారీ చేస్తూ ఫైల్‌పై సీఎం సంతకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *