Tuesday, 3 November 2026

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

putg1slsహైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు బంగారం స్మగ్లింగ్ కు రన్ వేగా మారింది. ప్రతి రోజూ… ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ రవాణా జరుగోంది. నిత్యం భారీగా బంగారం పట్టుబడింది. తాజాగా ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అబుదాబి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 700 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అధికారులు అదపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ప్రయాణికులు కేరళ వాసులుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *