చిత్తూరు: జిల్లాలోని శేషాచల అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. 3 రోజుల క్రితం జరిగిన భారీ ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో ప్రత్యేక దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. మరో వైపు తమిళనాడుకు నుంచి వందల సంఖ్యలో కూలీలు మళ్లీ అడవిలోకి వస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ కి సమాచారం అందింది. దీంతో రెండు ప్రబ్యేతక బృందాలు గురువారం రాత్రి నుంచి కూబింగ్ ముమ్మరం చేశాయి.




