తిరుపతి,ఫిబ్రవరి20 ( జనంసాక్షి)
: మహాశివరాత్రి వార్షిక బ్ర¬్మత్సవాల్లో భాగంగా శుక్రవారం వేకువ జామున ఆది దంపతులైన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కంధ మూర్తి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయం నుంచి పెళ్లి కుమారునిగా స్వామివారు గజవాహనాన్ని అధిరోహించారు. వధువు జ్ఞానాంబిక అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పట్టణ నడిబొడ్డున ఉన్న పెళ్లి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోశ్చరణలు, మేళతాళాలు, భక్తుల శివనామస్మరణ మధ్య కల్యాణ్ఠత్సవ ఘట్టాన్ని పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ శుభ తరుణంలో 97 మంది నూతన వధలివరులు వివాహాలు చేసుకున్నారు. నూతన వధలివరులకు ఈవో రామిరెడ్డి ఆలయం తరపున సారెను అందించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.




