విజయవాడ,ఫిబ్రవరి20( జనంసాక్షి)
: విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే గ్దదె రామ్మోహన్‌తో కలిసి ఆసుపత్రి ప్రాంగణాన్ని, బ్లాకుల్ని పరిశీలించారు. సిద్దార్థ వైద్య కళాశాల పక్కనే ఉన్న మూడెకరాల స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించారు. నవ్యాంధ్ర రాజధాని నగరాన్ని ఆరోగ్యప్రదంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎంపీ కేశినేని వెల్లడించారు




