శ్రీవారిని దర్శించుకున్న తలసాని

తిరుమల,జూన్‌11(జ‌నం సాక్షి):సోమవారం మధ్యాహ్నం కల్యాణోత్సవ విరామ సమయంలో రాష్ట్ర మంత్రితలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి వేదపండితులు వేదశీర్వచనం చేసి.. స్వామి వారి తీర్ధ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తలసాని తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడిపంటలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్దించినట్లు ఆయన పేర్కొన్నారు.