Tuesday, 3 November 2026

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి జైస్వాల్‌

తిరుమల : తిరుమల శ్రీవారిని కేంద్ర బొగ్గు గనులశాఖామంత్రి ప్రకాష్‌ జైస్వాల్‌ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అలయం వద్దకు చేరుకున్న జైస్వాల్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో తితిదే అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను కేంద్ర మంత్రికి అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *