కర్నూలు:సున్ని పెంటకు చెందిన వైసీపీ నేత వసంతరావును(55) వేటకొడవళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీశైలం రెండో జలవిద్యుత్ కేంద్రం వద్ద జరిగింది. స్థానికులు సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




