Tuesday, 3 November 2026

షూటింగ్‌లో అపశ్రుతి

బాలుడు మృతి.. బాలికకు గాయాలు
హైదరాబాద్‌, అక్టోబర్‌ 26 (జనంసాక్షి) :
టెలివిజన్‌ నటి అర్చనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షూటింగ్‌ సందర్భంగా కారు నడుపుతు రిత్విక్‌ అనే బాలుడి మృతికి ఆమె కారణమయ్యారు. శుక్రవారం ఉదయం నగరంలోని చందా నగర్‌ ప్రాంతంలో సీరియల్‌ చిత్రీకరణలో భాగంగా ఆమె కారు నడుపుతుండగా అది అదుపుతప్పి ఒక బాలుడి మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అర్చనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *