సంక్షేమంలో ముందున్నాం: మంత్రి
అనంతపురం,జూన్7(జనం సాక్షి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హావిూలను అమలు చేస్తున్నారని, సీమ అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి సాధించి రాష్ట్ర ప్రజలందరీ మోములో చిరునవ్వే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కరా/-యక్రమాలను ప్రారంభించిందని అన్నారు. ప్రతి ఇంటికి వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు, మైనార్టీ కమ్యూనిటీ హాల్, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు, తాగునీటి పథకం వంటి అనేక కార్యక్రమాలు గ్రామాల్లో చేపడుతున్నామని అన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, బిసి, ఎస్సీశ్మశానవాటికల అభివృద్ధి తదితర హావిూలను ముఖ్యమంత్రి అతితక్కువ కాలంలో అమలు చేశారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హావిూ ఇచ్చిన కొత్త రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు వివరించారు. చంద్రన్న సంక్రాంతికానుక, కుట్టమిషన్లు, దీపం గ్యాస్ కనెక్షన్లు పేదలకు పంపిణీ చేసి వారికి అండగానిలిచామని అన్నారు. పరిటాల కుటుంబం పేదలకు ఎన్నో ఏళ్లుగా అండగా ఉందన్నారు. ముఖ్యమంత్రి అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలని మంత్రి హితవు పలికారు.