నగరం నిద్రపోతున్న వేళ హైదరాబాద్లో దారుణం జరిగింది. మలక్ పేట ఏరియాలో ఓ వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా బండారాయితో మోది హత్య చేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. క్లూస్ టీమ్తో తనిఖీలు చేపట్టారు. తొందర్లోనే దుండగులను పట్టుకుంటామని పోలీస్ అధికారులు చెప్పారు.