ఉమ్మడి సంస్థల విభజన జరగలేదు
టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం
హైదరాబాద్, జనవరి11(జనంసాక్షి): సంపూర్ణ తెలంగాణ ఇంకా రాలేదనీ, దాన్ని సాధించడానికి తెలంగాణ విద్యావంతుల వేదిక పోరాటం సాగిస్తుందనీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఐదో వార్హిక సదస్సు ఆదివారం ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం ప్రసంగించారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు. తెలంగాణలో ప్రజాశ్రేయస్సు ముఖ్యమని ఫిలింసిటీ, ఫార్మాసిటీ అవసరం లేదని, హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు వద్దని తీర్మానం చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు అందాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఉమ్మడి సంస్థల విభజన వెంటనే జరగాలని కోదండరాం డిమాండ్ చేశారు.





