Monday, 2 November 2026

సబ్సిడియేతర వంట గ్యాస్ ధర పెంపు

గ్యాస్ వినియోగదారులకు మరో చేదు వార్త . అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా విమాన ఇంధన (ఏటీఎఫ్), సబ్సిడీయేతర వంటగ్యాస్ ధరలను ప్రభుత్వం పెంచింది. విమాన ఇంధన ధర 7.50 శాతం, సిలిండరు ధర రూ.10.50 చొప్పున పెంచారు. ఫలితంగా దిల్లీలో ఏటీఎఫ్ కిలో లీటరుకు రూ.3,744.08 పెరిగి రూ.53,353.92కు చేరింది. మే 1న ఏటీఎఫ్ ధరను 0.5 శాతం (రూ.272) పెంచడంతో ఇప్పటివరకు రూ.49,609.84చొప్పున విక్రయించారు. అదేవిధంగా సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండరు (14.2 కిలోగ్రాములు) ధర ఢిల్లీలో రూ.10.50 పెరిగి రూ.626.50కు చేరింది. మే1న రూ.5 పెంచడంతో, ఇప్పటివరకు రూ.616కు విక్రయించారు. ప్రతి కనెక్షన్‌పై ఏడాదికి 12 వంటగ్యాస్ సిలిండర్ల (14.2కిలో)ను సబ్సిడీపై అందిస్తున్నారు. సబ్సిడీపై ఒక్కో సిలిండరు రూ.417 అవుతోంది. అవి పూర్తయ్యాక, రూ.626.50 చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 5 కిలోగ్రాములవి అయితే ఏడాదికి 34 సిలిండర్లు సబ్సిడీపై అందిస్తారు. సబ్సిడీ ప్రకారం ఈ సిలిండరు ధర రూ.155 మాత్రమే. అనంతరం వీటిని రూ.318.50 చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాణిజ్య అవసరాలకు వాడే 19 కిలోల వంటగ్యాస్ సిలిండరును రూ.1,134 నుంచి రూ.1,151కు పెంచారు. ఆయా రాష్ట్రాలలో స్థానిక పన్నులు, వ్యాట్ కారణంగా ఈ ధరలు మారతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *