– ప్రధాని మోదీ
ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,అక్టోబర్ 16 (జనంసాక్షి):
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు సమచారం తెలుసుకోవడమే కాకుండా,ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దీనిని పటిష్టంచేస్తామని అన్నారు. కేంద్ర సమాచార కమిషన్ 10వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం సమాచారం తెలుసుకోవటానికి మాత్రమే కాదని, ఇందులో ప్రశ్నించే హక్కు కూడా ఉందన్నారు. ప్రభుత్వం, ప్రజల మధ్య పారదర్శకత ఉండాలన్నారు. ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నించాలని అన్నారు.అప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. బొగ్గు కుంభకోణం వంటివి సమాచార హక్కు ద్వారా వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఈ వేలం పద్దతి ద్వారా అనేక అవకతవకలను అరికట్టగలుగుతున్నామని మోడీ అన్నారు.పారదర్శకత కోసమే ఆన్ లైన్ పద్దతి ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.ప్రభుత్వ కార్యకలాపాలు రహస్యంగా ఉండవలసిన అవసరం ఏముందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, తదితరులు పాల్గొన్నారు.





