Thursday, 5 November 2026

ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు

హైదరాబాద్‌ : ప్రేమించడం లేదని అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ పోసిన దాడులు ఇప్పటి వరకు విన్నాం. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తనను ప్రేమించడం లేదని ఓ యువకుడిపై అతన్ని ప్రేమించిన ఓ యువతి యాసిడ్ దాడి చేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. వెంకటేష్ అనే యువకుడిపై అతని మాజీ ప్రియురాలు గీతాంజలి యాసిడ్ దాడి కి పాల్పడింది. తనకు తెలియకుండా మరో అమ్మాయితో కూడా ప్రేమాయణం సాగిస్తున్నాడని తెలిసి కోపం పట్టలేక అతని ముఖం పై యాసిడ్ పోసింది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు ముఖంతో పాటు శరీరంలోని పలు చోట్ల కాలిన గాయాలు అయ్యాయి. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంకటేష్ కు చికిత్స చేయిస్తున్నట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *