Tuesday, 3 November 2026

సమాచార శాఖను ఆధునీకరిస్తాం

C

– మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 21(జనంసాక్షి): ప్రభుత్వానికిప్రజలకు వారధిగా ఉన్న సమాచార శాఖ ఇంకా బలోపేతం కావాలని నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. లకిడీకాపూల్‌లోని ¬టల్‌ అశోకాలోఆదివారం ఏర్పాటు చేసిన ప్రజా సంబంధాలశాఖ అధికారుల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 20సంవత్సరాల క్రితం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతోనే సమాచార శాఖ నడుస్తోందని, మారుతున్న కాలం ప్రకారం సమాచార శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. పనిచేస్తున్న శాఖపై అవగాహన ఉంటే దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని అధికారులకు గుర్తుచేశారు. ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను ప్రజలకు తెలుపుతూ వారి నుంచి స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవడంలో ముందుండాలని సమాచార శాఖ అధికారులను కోరారు. ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి మాట్లాడుతూ ప్రభుత్వానికి కళ్లుచెవులూ మొత్తం సమాచారశాఖేనని ఈ శాఖలో పనిచేసే అధికారులు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరారు. సమాచారశాఖలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రోత్సాహకాలను మంత్రి హరీష్‌రావు ప్రభుత్వసలహాదారుడు రమణాచారి అందజేశారు.

ప్రజలు-ప్రభుత్వానికి పీఆర్వోలు వారధులు

ప్రజలు-ప్రభుత్వానికి పీఆర్వోలు వారధి లాటివారని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ప్రస్తుత కాలంలో పీఆర్వోల ప్రాముఖ్యత పెరిగిందని, వార్తలను ప్రజలకు చేరవేయడంలో పీఆర్వోల పాత్ర ఎనలేనిదని మంత్రి చెప్పారు. పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ లక్డికాపూల్‌ లో నిర్వహించిన రాష్ట్ర తొలి మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీఆర్వోలు వారివారి శాఖలపై సంపూర్ణ అవగాహన కలికి ఉండాలని హరీష్‌ రావు సూచించారు. ప్రజా సంబంధాల శాఖను ఇంకా బలోపేతం చేయాలన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పిఆర్వోలు అప్డేట్‌ కావాలని సూచించారు. ఎప్పటికప్పుడు శిక్షణతో పీఆర్వోలు సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, విద్యాసాగర్‌ రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *