సమైక్య ఉద్యమానికి మించిన పోరాటానికి సిద్ధం

– అశోక్‌బాబు
విజయవాడ, మే9(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కోసం సమైక్య ఉద్యమానికి మించిన పోరాటానికి సిద్ధమని ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. బుధవారం ¬దా, విభజన హావిూలు అమలు చేయాలంటూ కలెక్టరేట్ల దగ్గర ఏపీ ఎన్జీవోల ధర్నాలు చేపట్టారు. ధర్నా చౌక్‌ వద్ద కార్యక్రమంలో అశోక్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ¬దాకోసం రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పనిచేయడం లేదని విమర్శించారు. రాజకీయలబ్ధి కోసం సొంత అజెండాలతో పనిచేస్తున్నారన్నారని ఆరోపించారు. తమతో కలసొచ్చే పార్టీలు, ప్రజాసంఘాలతో నడుస్తామని అశోక్‌బాబు
స్పష్టం చేశారు.
అశోక్‌బాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు..
అశోక్‌బాబు కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారంటూ ఆ పార్టీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ప్రధానిని విమర్శించడం సరికాదన్నారు. అశోక్‌బాబుపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరామని బీజేపీ నేతలు తెలిపారు. ఎన్నికల ప్రచారం చేయడం సర్వీస్‌ రూల్స్‌ అతిక్రమించడమే అని అన్నారు.సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తారనే నమ్మకంతోనే అశోక్‌బాబు
రాజీనామా చేస్తానంటున్నారని బీజేపీ నేతలు విమర్శించారు.

తాజావార్తలు