సల్మాన్ షాదీ అల్లాకే తెలియాలి
దలైలామాతో కండల వీరుడు భేటి
ఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి):బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ పెళ్లి ఎప్పుడా అని అబి óమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల సల్లూభాయి.. లులియా వంతూ రుతో త్వరలో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వెలు వడ్డాయి. కానీ దీనిపై ఇంతవరకు స్పష్టత రాలే దు. దీంతో సల్మాన్‌పెళ్లిపై ట్విట్టర్ వేదికగా ఆయ న తండ్రి సలీంఖాన్‌ని అభిమానులు ఆరాతీ శారు.”సల్లూభాయ్ పెళ్లెప్పుడవుతుంది? అసలు అవుతుందా?” అంటూ సలీంఖాన్‌ని ప్రశ్నిం చారు. దీనికి స్పందించిన రచయిత సలీం ఖాన్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ”సల్మాన్ పెళ్లి గురించి నన్నేవిూ అడగొద్దు. ఎందుకంటే అది ఎ ప్పుడు జరుగుతుందో అసలా దేవుడికి కూడా తెలీ దు. ఇక దాని గురించి నేనేం చెప్పగలను” అం టూ వ్యంగ్యంగా మాధానం ఇచ్చారు.తాజాగా సల్మాన్ ‘ట్యూబ్‌లైట్’ చిత్రం కోసం జమ్ముకశ్మీర్‌లోని లఢక్‌కు వెళ్లారు. ఆసక్తికర అంశమేంటంటే.. ఈ షెడ్యూల్‌లో తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ లులియా సైతం సల్మాన్‌తో చక్కర్లు కొడుతోంది. లులియాతో కలిసి సల్లూభాయ్ లఢక్‌లో ఉన్న మతగురువు దలైలామాను కలవడానికి వెళ్లాడు. ఇప్పుడా చిత్రాలు సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మతో అయినా పెళ్లిపీటలు ఎక్కుతాడో లేదో చూడాలి.