గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా సింగరంపాలెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సింగరంపాలెంకు చెందిన ముఠా కూలీలు పనికి వెళ్లి తిరిగి ట్రాక్టర్‌పై వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 108 సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.




