Tuesday, 3 November 2026

సింధుకు ఘన స్వాగతం పలుకుతాం

ktr-7క్రీడల్లో బాలికల ప్రవేశానికి ప్రేరణ పీవీ సింధు: కేటీఆర్

 

ఒలింపిక్స్‌లో రజతం సాధించిన రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును అభినందించారు మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు కేటీఆర్. సెమీఫైనల్లో, ఫైనల్లో సింధు ఆడిన తీరు పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించిందని ఆయన కొనియాడారు. క్రీడల్లో బాలికల ప్రవేశానికి ప్రేరణగా ఆమె నిలుస్తుందని ప్రశంసించారు. సింధును ఆణిముత్యంలా తీర్చిదిద్దిన కోచ్‌ గోపీచంద్‌ సేవలు క్రీడాలోకానికి అవసరమన్నారు.  హైదరాబాద్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌  (ఓఏటీ) కూడా సింధును అభినందించాయి.

2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ కు కేంద్ర, రాష్ట్రాలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని మంత్రి కేటీఆర్ సూచించారు. క్రీడాకారులకు ప్రభుత్వ సహకారం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 132 కోట్ల జనాభా ఉన్న భారత్ కు కేవలం రెండే ఒలింపిక్ పతకాలు రావటాన్ని తీవ్రంగా తీసుకోవాలని అన్నారు. మిషన్ టోక్యో 2020 పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని ప్రధాని మోడీకి ఇవాళ ఉదయం సూచించానని మంత్రి కేటీఆర్ తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ లో 20 పతకాలు వచ్చేలా ఈరోజు నుంచే పని ప్రారంభించాల్సిందిగా కోరానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *