నంద్యాల : కర్నూలు జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన మహిళలు నంద్యాల పత్తి మిల్లులో పనికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది, ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడిన వారికి 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.




