సిలికాన్ వ్యాలీ కంపెనీలతో కేటీఆర్ కీలక భేటీి
– హైదరాబాద్లో అడోబ్కంపెనీ విస్తరణకు హామీ
హైదరాబాద్,మే13(జనంసాక్షి):
తెలంగాణ ఐటి , పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తన ఏడవరోజు అమెరికా పర్యటనలో సిలికాన్ వ్యాలీలో పర్యటించారు. సిలికాన్ వ్యాలీలోని పలువురు ప్రముఖ వ్యాపార వేత్తలను, కంపెనీలను కలిసారు. ఉదయం పూట అడోబ్ సిస్టమ్స్ సియివో శాంతను నారాయన్ ని కలిసారు. హైదరాబాద్ నుంచి అడోబ్ కంపెనీ అధినేతగా ఏదిగిన శాతంను నారాయణ్ హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి బృందాన్ని అభినందించారు. తాను పక్కా హైదరాబాదీని అన్న శాంతను నారాయన్ హైదరాబాద్ కోసం ఖచ్చితంగా సహకారం అందజేస్తానని మంత్రి కె.తారకరామా రావుకి తెలిపారు. హైదరాబాద్ నగరం అభివృద్దికి, తెలంగాణలో వ్యాపారాభివృద్దికి నూతన ప్రభుత్వ చేస్తున్న కార్యక్రమాలను మంత్రి అయనకి వివరించారు. హైదరాబాద్ లో అడోబ్ కంపెనీ విస్తరణ చేపట్టాలని మంత్రి నారాయన్ ని కోరారు. దీనికి స్పందించినన అడోబ్ సియివో తప్పకుండా తమ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ ఉంటుందని మంత్రికి హవిూ ఇచ్చారు
మద్యాహ్నం ఓరాకిల్ కంపెనీ సియివో మార్క్ హర్డ్ ని మంత్రి కె.తారకరామారావు కలిసారు. ఓకారకిల్ కంపెనీకి తెలంగాణ రాష్ట్రంగురించి వివరించిన మంత్రి విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానం గురించి వివరించారు. హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాధాన్యతలను , (అడ్వాంటేజ్ లు) వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మరియు ఓరాకిల్ కలసి పనిచేందుకు వీలున్న పలు రంగాల గురించి మంత్రి మార్క్ హర్డ్ తో చర్చించారు. హైదరారాబాద్ నగరంలో ఉన్న డాటా సెంటర్లకి ఉన్న రక్షణాను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అభినందించిన ఓరాకిల్ కంపెనీ హైదరాబాద్ నగరంలో పెట్టుబడులకి అసక్తి చూపింది.
ఆతర్వాత మంత్రి ప్రత్యామ్నయా ఇందన వనరుల విభాగంలొ ప్రఖ్యాత భ్లూమ్ ఏనర్జీ సియివో కె.అర్ శ్రీదర్ తో సమావేశమయ్యారు. సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మక మైన ప్యూయల్ సెల్ టెక్నాలజీ గురించి శ్రీదర్ మంత్రి వివరించారు.అరచేయి విస్తీర్ణంలో ఉన్న ఓక్క ప్యూయల్ సెల్ తో ఓక మెత్తం ఇంటికి విద్యుత్ అవసరాలు తీర్చగలిగే ప్రత్యేక బ్లూమ్ టెక్నాలజీ కంపెనికి ఉందని శ్రీదర్ తెలిపారు. బ్లూమ్ టెక్నాలజీ ప్రాంగణంలో మంత్రి పర్యటించారు . ఈ కంపెనీని తెలంగాణలోకి రావాల్సిందిగా మంత్రి కోరారు. తెలంగాణలోని ఏదైనా ఓక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, తెలంగాణలో మ్యాన్యపాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే హైదరాబాద్ నగరానికి వస్తానని శ్రీదర్ మంత్రికి హవిూ ఇచ్చారు. మంత్రి సాయంత్రం ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్గు కన్వల్ రేఖి మరియు కీర్తి మెల్కోటే ల అరుబా నెట్ వర్కస్ ని సందర్శించి సమావేశమయ్యారు.టి హబ్ లో పెట్టుబడలుల గురించి చర్చించారు. అరుభా నెట్ వర్క్స్ ని ఈ మద్యనే మూడు బిలియన్ డాలర్లకి హెచ్ పి కంపెనీ టేకోవర్ చేసిన విషయాన్ని వారు మంత్రికివిరించారు. తెలంగాణ కోసం యాబై ఏళ్లకింద తమ తాతయ్య మాజీ పార్లమెంటట్ సబ్యుడ్ జియస్ మెల్కోటే పోరాడిన తెలంగాణ కళ సాకరమైందుకు వారు తమ సంతోషాన్ని మంత్రితో పంచుకున్నారు.