సీఎం వరాలపై కార్మిక నేతల హర్షం

5

హైదరాబాద్‌,మే13(జనంసాక్షి):

ఆర్టీసీ కార్మికులకు కోరకుండానే వారలు కురిపించిన సీఎం కేసీఆర్‌కు టీఎంయూ నేత అశ్వథ్ధామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తాము 43శాతంవ అడిగితే సిఎం 44 శాతం ఫిట్‌మెంట్‌ పెంచి మా కష్టాలను అర్థం చేసుకున్నారని అన్నారు. సిఎంతో చర్చలు సఫలం అయ్యాక సచివాలయంలో ఆయన విూడియాతో మాట్లాడారు. ఇవాళ్టి నుంచి తమ బాధ్యత పెరిగిందన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ తాము కోరిన దానికంటే ఒక శాతం ఫిట్‌మెంట్‌ ఎక్కువగా పెంచడం సంతోషంగా ఉందన్నారు. కష్టపడి పని చేసి ఆర్టీసీని కాపాడుకుంటాం. చరిత్రలో ఎప్పుడు ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వలేదు. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ సందర్భం ఇదని ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుంచి సమ్మె విరమిస్తున్నామని, ఇక కార్మికులందరూ విధుల్లోకి హాజరవుతారన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రులకు అధికారులకు, విూడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  కార్మికుంలదరూ కష్టపడి పని చేయాలని ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రూ. 3 వేల నుంచి రూ. 22 వేల వరకు జీతాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ 44 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాక  బస్‌భవన్‌ వద్ద విూడియాతో కార్మికులు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కు ధన్యవాదాలు తెలిపారు.  44 శాతం ఫిట్‌మెంట్‌ పెంచుతారని తాము ఊహించలేదని, . తాము కోరుకున్న దాని కంటే ఒక శాతం ఫిట్‌మెంట్‌ ఎక్కువగా పెంచడం సంతోషంగా ఉందన్నారు.  తాము సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కష్టపడుతాం. బంగారు తెలంగాణే లక్ష్యంగా పని చేస్తాం. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో బంగారు తెలంగాణను సాధిస్తామని కార్మికులు చెప్పారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు.  సీఎం కేసీఆర్‌ ప్రకటనతో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. డిపోల ఎదుట బాణాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకున్నారు.