Tuesday, 3 November 2026

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): రంగారెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన 14 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను నియమించనున్నామని ఆసక్తి, అర్హతల కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13లోగా దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి తెలిపారు. అభ్యర్థులు తమ ఎస్సెసీ, ఇంటర్మీడియెట్‌ ఎంబిబిఎస్‌ మార్కులు మెమో, కుల ధృవీకరణ, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్ల కాపీలను తమ బయోడేటాకు జతపర్చి నిర్ణీత గడువులోగా రాజేంద్రనగర్‌ మండలంలో శివరాంపల్లి, డోర్‌ నెంబరు 6-2-70లో గల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయానికి పంపాలని కలెక్టర్‌ సూచించారు. అభ్యర్థుల ఎంపికలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తప్పనిసరిగా పాటించడం జరుగుతుందని, ఎంపికైన వారికి నెలకు రూ.20,680 వేతనం చెల్లించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *