Monday, 2 November 2026

సీఎం క్యాంప్‌ ఆఫీస్ ముట్టడికి విద్యార్థుల యత్నం

3హైదరాబాద్ : రోహిత్‌ ఆత్మహత్యను నిరసిస్తూ ఓయూలో విద్యార్థి సంఘాలు చేపట్టిన సియం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. రోహిత్ ఆత్మహత్యపై సిఎం కెసిఆర్ స్పందించకపోవడంపై విద్యార్థి సంఘాలు సిఎం క్యాంప్ ఆఫీస్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. వారు చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *