మొదటి రోజున 2,534 మంది షికాయత్
హైదరాబాద్ జనవరి12(జనంసాక్షి): ప్రజల తమ విజ్ఞప్తులు, పిర్యాదులు , సమ్యస్యలు వి న్నవంచడానికి ఏర్పాటు చేసిన టోల్‌ప్రీ నంబర్ కు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది . వరంగల్ పర్యటన సందర్బంగా ముఖ్యంత్రి కె. చంద్రశేర్ రావు ఆది వారం ప్రభుత్వం తరపున 040 -2345071 నంబర్ ను ప్రకటించారు. సోమవారం సాయంత్రం వరక వివిధ జిల్లాల నుండి ఈ నంబర్ కు 2534 మంది తమ సమస్యలు చెప్పుకున్నారు పోన్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లయ్ మేసోజ్ కూడ అందింది . ఈ నంబర్ ద్వార ప్రస్తుతం 30 లైన్లు పనిచేస్తున్నాయి. అయినప్పటికి సరిపోవడం లేదు. లైన్లు బిజిగా ఉంటున్నాయి. దీంతో మరో 30 లైన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఒకే సారి 60 మంది ఫోన్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించే వెసులుబాటు కలుగుతుంది. త్వరలోనే ఇదే నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఈ మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదులు పంపే సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అన్ని శాఖలు, అన్ని అంశాలకు సంబంధించి ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించింది. ప్రభుత్వం త్వరలోనే ఈ మెయిల్ ఐడిని కూడా ప్రకటిస్తుంది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులను శాఖల వారిగా విభజించి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది.




