Wednesday, 4 November 2026

సీసీ కెమెరాలో ఇంజెక్షన్‌ సైకో

పశ్చిమగోదావరి : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ‘సూది సైకో’ ఎట్టకేలకు సీసీ కెమెరాకు చిక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇంజెక్షన్‌ సైకోను బంధించాయి. బ్లూ షర్ట్ వేసుకుని, నల్లటి టోపి పెట్టుకున్న ఓ వ్యక్తి హోండా షైన్‌ బండిపై అనుమానాస్పదంగా తిరుగుతున్న సైకోను పోలీసులు గుర్తించారు. మొదటి దాడి జరిగిన ఆగస్టు 22న ఈ సైకో పసుపు రంగు షర్టు ధరించాడు. ఇక అనంతర దాడుల్లో బ్లూ షర్ట్, జీన్స్‌ వేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైకో ఛాయాచిత్రం దొరకటంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉన్మాది సమాచారం తెలిసిన వెంటనే నరసాపురం, డీఎస్పీ, భీమవరం రూరల్ సీఐకు తెలియ జేయాలని కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *