యాంకర్ సుమ కనకాలకు అరుదైన గౌరవం దక్కింది. టీవీ యాంకర్ గా కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న సుమ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ప్రముఖ చానెల్లో ఓ కార్యక్రమానికి అత్యధిక ఎపిసోడ్లకు వ్యాఖ్యతగా ఆమె జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలిపింది. 2008లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సాధారణ గృహిణిల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. గత ఏడాది జులైకి 1815 ఎపిసోడ్లు పూర్తి చేసినందుకుగాను సుమకు ఈ ఘనత దక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు గృహిణులు, యువతులు సైతం ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఇష్టపడుతున్నారు. ఇప్పటీకి 2045 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
సుమకు అరుదైన గౌరవం




