శ్రీకాకుళం : అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను ఆదిత్యుని లేలేత కిరాణాలు ఈ ఉదయం స్పృశించాయి. స్వామి మూలవిరాట్టును భానుడి కిరణాలు తాకిన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఈ అపురూప సుందర దృశ్యం వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.




