సెల్ఫీ కోసం మైక్రోసాఫ్ట్‌ సరికొత్త యాప్‌


22
, హైదరాబాద్‌: సెల్ఫీ.. రోజురోజుకీ ఈ ట్రెండ్‌ పెరిగిపోతుంది తప్ప.. ఏ మాత్రం తగ్గడంలేదు. సెల్ఫీపై యువతకున్న క్రేజ్‌తో మొబైల్‌ తయారీసంస్థలు కూడా ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని ఫోన్లను కూడా విడుదల చేశాయి. తాజాగా.. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సెల్ఫీల కోసం సరికొత్త యాప్‌ను విడుదల చేసింది.

సాధారణ సెల్ఫీలతో పోలిస్తే.. ఈ యాప్‌ ద్వారా తీసే సెల్ఫీలు విభిన్నంగా ఉంటాయి. ఇందులో ఇన్‌బిల్ట్‌ బ్యూటీ అప్లికేషన్లు ఉంటాయి. దీని ద్వారా ఫొటో తీసుకునేప్పుడు కలర్‌, ఆటోమెటిక్‌ రెజల్యూషన్‌, బ్రైటెన్‌ తదితర ఫీచర్లు సెల్ఫీ మరింత అందంగా వచ్చేందుకు ఉపయోగపడుతాయి.ప్రస్తుతం ఐఓఎస్‌ ఫోన్లలో మాత్రమే ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. చైనాకు చెందిన షీయోమీ మొబైల్‌ ఫోన్లలో ఉండే బ్యూటీ యాప్‌ లాంటిదే.. ఈ సెల్ఫీ యాప్‌ కూడా.