Tuesday, 3 November 2026

సెల్ టవర్ వద్దకు చేరుకున్న మంత్రి పత్తిపాటి..

గుంటూరు : ఏపీ ప్రత్యేక హోదాపై ఓ యువకుడు మంగళదాస్ నగర్ లో సెల్ టవర్ పైకి ఎక్కి చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. శనివారం నుండి అతను టవర్ పైనే ఉన్నాడు. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా కిందకు దిగడానికి సంజీవరావు ఒప్పుకోవడం లేదు. దీనితో మంత్రి పత్తిపాటి అక్కడకు చేరుకున్నారు. టవర్ నుండి కిందకు దిగి రావాలని పత్తిపాటి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ను రంగంలోకి దించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *