హైదరాబాద్ మలక్ పేటలోని సైదాబాద్ ప్రధాన రహదారిపై జీహెచ్ఎంసీ, హరేరామ హరేకృష్ణ మూమెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రూపాయలకు భోజనం కౌంటర్ ను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. నగరంలోని పేదలకు కడుపునిండా భోజనం పెట్టేందుకే ప్రభుత్వం ఐదు రూపాయలకే భోజన పథకాన్ని ప్రారంభించిందని డిప్యూటీ సీఎం అన్నారు. పాతబస్తీలో మరిన్ని కేంద్రాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం, ఇతర నేతలు పాల్గొన్నారు.
సైదాబాద్ లో రూ.5 భోజనం కౌంటర్




