Tuesday, 3 November 2026

స్కూల్‌ బస్సు లారీ ఢీ కొని 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఒంగోలు,(జనంసాక్షి): ప్రకాశం జిల్లాలోని జరుగుమిల్లి మండలం కలికివాయి బిట్రగుంట జాతీయ రహదారిపై శుక్రవారం స్కూల్‌ బస్సు,లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అదే జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు విద్యార్థులను ఒంగోలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్‌ స్థంభించింది. ట్రాఫిక్‌ పునరుద్దరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *