Tuesday, 3 November 2026

స్టేట్‌ బ్యాంక్‌లో చోరీకి యత్నం

అనంతపురం,మార్చి9(జ‌నంసాక్షి): స్టేట్‌ బ్యాంక్‌లో చోరికి దుండుగులు విఫలయత్నం చేశారు. బ్యాంక్‌ లోని అలారం మొగడంతో వారు పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్టేట్‌ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గోడ పెకిలించి బ్యాంకు లోపలికి ప్రవేశించిన దుండగులు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత స్టాం/-రగ్‌రూంను తెరవడానికి  ప్రయత్నించడంతో ఒక్కసారిగా అలారం మోగింది. స్థానికులు ఎవరైన వస్తారేమోననే.. భయంతో దుండగులు పరారయ్యారు. సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది విషయాన్ని మేనేజర్‌ రాంప్రసాద్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌టీంతో సహా సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాధమిక దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *